Tuesday, 18 September 2018

🔥 *నిన్ను నీవే పరీక్షించుకొనుము* 🔥

ఆత్మీయ జీవితమంటేనే పరీక్ష. మనలను మనమే పరీక్షించుకొనటము.
ఒక్క సారి మనలను మనము పరీక్షించుకుందామా?ఒకప్పడెలా ఉన్నామో, ఇప్పుడెలా ఉన్నామో అని.

👉 *ఒకప్పుడు ప్రభువు సధ్నిధిలో గంటలు,గంటలు గడిపే నీవు ఇప్పుడెందుకు గడపలేకపోవుచున్నావు?*

👉 *ఒకప్పడు ఏలియా, ఎలిషావలే దేవునికోసము రోషముగా జీవించిన నీవు ఇప్పుడెందుకు జీవించలేకపోవుచున్నావు?*

👉 *ఒకప్పుడు యోసేపువలే పాపమును జయించిననీవు ఇప్పుడెందుకు పాపాన్ని జయించలేక పోవుచున్నావు?*

👉 *ఒకప్పుడు అందరితో ప్రేమతో మాట్లాడే నీవు ఇప్పుడెందుకు పదేపదే కోపగించుకుంటూ,ఇతరులపై సణుగుతున్నావు?*

👉 *ఒకప్పుడు దేవునిసొమ్మును(కానుకలు)దేవునికి నమ్మకముగా ఇచ్చేనీవు ఇప్పుడెందుకు నీవు నీ చేతిని బిగబడతావు?*

👉 *ఒకప్పుడు ప్రార్ధనకు,వాక్యమునకు ప్రధమస్ధానమిచ్చే నీవు ఇప్పుడెందుకు ఇవ్వలేకపోతున్నావు?*

👉 *ఒకప్పుడు శరీరాన్ని నలుగగొట్టిన నీవు ఇప్పుడెందుకు దాన్ని సుఖపెడుతున్నావు?*

          ఒక్క సారి ఆగి ఆలోచించు మిత్రమా? *నీవు దేవునికోసము బ్రతికిన పూర్వపు దినములు కావాలా? లేక ఈ పాపపు పాపిష్టి బ్రతుకే కావాలా?*

     *నేను తెలిసి తెలిసి పాపము చేశాను దేవుడు నన్ను క్షమించడు అని అనుకుంటున్నావా?*.దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కచ్చితముగా నిన్ను చేర్చుకుంటాడు.

      తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలివెల్లి, మరలా తన తప్పు తెలుసుకొని తండ్రియొద్దకు వచ్చిన ఆ కుమారున్ని తండ్రి చేర్చుకున్నాడు. నిన్ను కూడా యేసు చేర్చుకుంటాడు. పశ్చాత్తాపముతో యేసు పాదాలచెంత చేరుము నేస్తమా.!

దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

*ఆమేన్.! ఆమేన్.!! ఆమేన్.!!!*

Sunday, 10 December 2017

ఏసుక్రీస్తు డిసెంబర్ 25 నే పుట్టాడా ?ఆధారాలు ఉన్నాయా

ఏసుక్రీస్తు డిసెంబర్ 25 నే పుట్టాడా ?ఆధారాలు ఉన్నాయా ?

ఏసుక్రీస్తు యొక్క పుట్టినరోజును మనం పండగలా జరుపుకోవచ్చా?

మొదటి ప్రశ్న క్రైస్తవేతరుల నుండి తరచూ మనం వింటూ ఉంటాము.
ఈ ప్రశ్నల గురించి క్రైస్తవుల లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

క్రైస్తవులు ఈ విషయం లో కంగారుపడవలసిన అవసరం లేదు, మనం మనదేవుడి గురించి ఏదీ  గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు,మన దేవుడు గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి.    మనదేవుడు నిజ దేవుడు, ఉన్నవాడు.

క్రీ.పూ 31 నుండి  క్రీ.శ 14 వరకు కైసరు అగస్టీస్ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.ప్రస్తుతం ఇది ఇటలీ రాజధాని.నూతన నిబంధన కాలంలో మధ్యధరా సముద్రానికి చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటినీ రోమీయులు జయించారు,వారి అధికారం చివరికి ఫ్రాన్స్ ,ఇంగ్లాండ్ ల వరకు వ్యాపించింది,ఈవిధంగా వారి సామ్రాజ్యం యూరప్ ,ఉత్తర ఆఫ్రికా ,మధ్య ప్రాచ్య దేశాల్లో వ్యాప్తి చెందింది.
రోమనులు జయించిన దేశాలలో ఇశ్రాయేలు ,సిరియా లు కూడా ఉన్నాయి.

కైసర్ అగష్టిస్ తాను జయించిన దేశాల పరిపాలనను పునర్విభజన చేసి ,ఆ ప్రాంతాల లో సరిక్రొత్త జనాభా లెక్కలను తీసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు.
ఆ సమయం లో కురేనియు సిరియా కు అధిపతి గా ఉన్నాడు,ఆ కాలం లో ఇశ్రాయేలు,దాని రాజధాని యెరుషలేము సిరియా లో భాగము గా ఉన్నది.

దావీదు బెత్లేహేములో పుట్టాడు కనుక ,దావీదు వంశీయులు అందరూ అక్కడే జనసంఖ్య లో లెక్కించబడాలి.కావున నజరేతు లో ఉన్న యోసేపు గర్భవతి గా ఉన్న మరియను తీసుకొని బేత్లేహేము వచ్చి అక్కడ జనసంఖ్య లో వారి పేర్లు నమోదు చేసుకున్నారు,
అప్పుడు బేత్లేహేము లోనే మరియు ఏసుక్రీస్తు కు జన్మనిస్తుంది. మెస్సయ్య బేత్లేహేము లోనే జన్మిస్తాడు అని మీకా 5:2లో చెప్పబడిన ప్రవచనం ఇక్కడ నెరవేరింది. ఇదంతా మనం పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో చూస్తాము.

అయితే ఇదంతా నిజమేనా ?ఇది మనం నమ్మవచ్చా ? చూద్దాం.

1820 లో జెర్మన్ ఆర్కియాలజిస్ట్ russem ఆధ్వర్యంలో  కురేనియు యొక్క  పేలెస్ ను త్రవ్వుతున్నప్పుడు పైపరస్ బండిల్స్ దొరికాయి.
పైపరస్ అనేది ఆరోజుల్లో వ్రాయటానికి ఉపయోగించే కాగితం వంటిది. 

ఆ బండిల్స్ లో కురేనియు కాలం లో వ్రాయబడిన జన సంఖ్య ఉంది.అందులో 42 లక్షల 33 వేల పేర్లు రికార్డ్ అయి ఉన్నాయి.
జర్మన్ మ్యూజియం లో ఈరోజున కూడా ఆ రికార్డ్స్ ఉన్న బండిల్స్ మనం చూడవచ్చు.
దీనిని బట్టి బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు,నిజమైన దేవుని గ్రంధం అని నిరూపించబడింది.

యేసుక్రీస్తు డిసెంబర్ 25నే పుట్టాడా ?

క్రీ.శ 360 లో Dennis the little అనే పురావస్తు శాస్త్రవేత్త రోమన్ లైబ్రరీ నుండి యెరుషలేము దేవాలయం యొక్క temple records తీసి,ఆ రికార్డ్స్ లో ఉన్న ఏసుక్రీస్తు యొక్క సున్నతి దినముయొక్క date ను గుర్తించాడు.సున్నతి జరిగిన ఎనిమిది రోజులు ముందుకు లెక్కించి
వారి కేలండర్ నుండి మనం వాడే కేలండర్ లోకి మార్చి caliculate చేసి డిసెంబర్ 25 న ఏసుక్రీస్తు పుట్టినరోజు అని నిర్ధారణ చేశారు.

ఆ కాలంలో  యూదులు  పుట్టిన పిల్లవాడికి సున్నతి చేసి ,పేరు పెట్టేటప్పుడు ఆ పిల్లవాడి యొక్క ditailsను  temple రికార్డ్స్ లో నోట్ చేసేవాళ్లు.అలాగే ఏసుక్రీస్తు కు కూడా సున్నతి చేసినట్లు గా బైబిల్ లో ఉంది.
ఆ రికార్డ్స్ ఇప్పుడు కూడా రోమన్ లైబ్రరీ లో మనం చూడవచ్చు.

కనుక డిసెంబర్ 25న ఏసుక్రీస్తు పుట్టాడు అని ఏదో ఊహించి చెప్పింది కాదు.దీనికి పక్కా evidens ఉన్నాయి.

ఏసుక్రీస్తు జన్మదినం ను మనం పండగలా జరుపుకోవచ్చా ?

ఇది మన క్రైస్తవుల లో కొంతమంది ప్రశ్న.
అపోస్తలులు ఎవరూ అలా చేయలేదు కదా మనం ఎందుకు చేయాలి అంటారు.

అపోస్తలులు సువార్త ను ప్రకటిస్తుఉంటేనే బ్రతకనీయలేదు,ఇంక పండగలు చేసుకోనిస్తారా?
 మొదటి శతాబ్దం లో 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి నరికి చంపారు.పండగలు ఎలా చేసుకోనిస్తారు?

అపోస్తులులు మనకు ఒక బేస్ ఇచ్చి వెళ్ళారు.
దేవుని విషయం లో మనం చేసేపనులు దేవుని మహిమ పరిచేవి గా ఉండాలి కానీ,సాతానుకు చోటు ఇవ్వకూడదు.
క్రిస్మస్ రోజు మనం దేవుని గురించే ఎక్కువగా ధ్యానిస్తాము,ఘనపరుస్తాము,మహిమ పరుస్తాము.
మహోన్నత   స్థలములో ఉండే దేవుడు ,మనకోసం భూమిమీద కు వచ్చి, అనేక శ్రమలు అనుభవించి ,మనకోసం ప్రాణం పెట్టిన యేసయ్య భూమి మీద జన్మించిన రోజును  మనము పండగలా జరుపుకోవడం తప్పు ఎలా అవుతుంది.

ఆయన తనను ఘనపరచటాన్ని ఎప్పుడూ కాదనలేదు,ఆయన పట్ల మనం అతిశయ పడటాన్ని ఆయన కాదనడు.

ఏసుక్రీస్తు యెరుషలేము లోకి ప్రవేశించేటప్పుడు అక్కడి జనం కొంతమంది ఏసుక్రీస్తును ఘనపరుస్తూ ఉంటారు.
అది చూస్తున్న అక్కడి శాస్త్రులు,పరిసయ్యులు కొంతమంది ఓర్చుకోలేక  ఆ ప్రజలయొక్క ఆనందాన్ని ,వారి ఉత్సాహాన్ని ఆపమని ఏసుక్రీస్తు తో చెబుతారు.
అప్పుడు ఏసుక్రీస్తు చక్కని మాట చెబుతాడు.

Luke(లూకా సువార్త) 19:39,40

1.ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులుబోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా
2.ఆయన వారిని చూచివీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.

అంటే దేవునిపట్ల మనం పండగ జరుపుకుంటు,ఉత్సాహం గా ,ఆనందం గా ఉండటం ఆయనకు ఇష్టమే.
ఆయన  యందు మనం అతిశయపడటము  తప్పుకాదు.

ఈ పండుగ ను లోకస్తుల వలే  కేవలం   క్రొత్త బట్టలకు,పిండి వంటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆరోజు అంతాకూడా దేవునిని ధ్యానించటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరికీ నా మనవి.

ఈ పోస్టు  నా క్రైస్తవ సమాజానికి christmas సందర్భం గా నేను ఇస్తున్న చిన్ని గిఫ్ట్.

చింత లేదిక ఏసుపుట్టెను వింతగను బెత్లేహమందునా...
చెంత చేరగా రండి సర్వ జనాంగమా...
సంతసమొందుమా...

Friday, 14 April 2017

THE SEVEN WORDS OF JESUS ON THE CROSs. 1st word

THE SEVEN WORDS OF JESUS ON THE CROSS





Christ Jesus died on the Cross to redeem mankind, to save us from our sins because of his love for us. As recorded in the Gospels of Matthew, Mark, Luke, and John in the Holy Bible, Jesus Christ was mocked, scorned, and tortured in the praetorium. He carried his cross up the Via Dolorosa in Jerusalem to Calvary, was nailed to the Cross, and hung between two common criminals. He suffered an indescribable end, recalled by the Church on Good Friday of Holy Week.

One may meditate on the Passion of Christ by reflecting on his Seven Words on the Cross or by a devotion known as The Way of the Cross.

When religious pilgrimages to the Holy Land ended with military occupation of Jerusalem in the Middle Ages, a popular devotion known as The Way of the Cross arose during Lent retracing the Passion, Crucifixion, and Death of Jesus. The fourteen Stations of the Cross are (1) Pilate condemns Jesus to death; (2) Jesus takes up his Cross; (3) He falls the first time; (4) Jesus meets his sorrowful mother Mary; (5) Simon helps carry the cross; (6) Veronica cleans his face; (7) He falls the second time; (8) Jesus consoles the women of Jerusalem; (9) He falls the third time; (10) Jesus is stripped of his garments; (11) Jesus is nailed to the cross; (12) Jesus Christ dies on the cross; (13) Our Lord is taken down from the cross; (14) Christ is laid in the tomb.

Here are his Seven Words, the last seven expressions of Jesus Christ on the Cross recorded in Scripture.


THE FIRST WORD

"Father, forgive them, for they do not know what they do."
Gospel of Luke 23:34
Jesus of Nazareth is looking down from the cross just after he was crucified between two criminals. He sees the soldiers who have mocked, scourged, and tortured him, and who have just nailed him to the cross. He probably remembers those who have sentenced him - Caiaphas and the high priests of the Sanhedrin. Pilate realized it was out of envy that they handed him over (Matthew 27:18, Mark 15:10). But is Jesus not also thinking of his Apostles and companions who have deserted him, to Peter who has denied him three times, to the fickle crowd, who only days before praised him on his entrance to Jerusalem, and then days later chose him over Barabbas to be crucified?

Is he also thinking of us, who daily forget him in our lives?

Does he react angrily? No! At the height of his physical suffering, his love prevails and He asks His Father to forgive! Could there ever be greater irony? Jesus asks his Father to forgive, but it is by His very Sacrifice on the Cross that mankind is able to be forgiven!

Right up to his final hours on earth, Jesus preaches forgiveness. He teaches forgiveness in the Lord's prayer: "Forgive us our trespasses, as we forgive those who trespass against us" (Matthew 6:12). When asked by Peter, how many times should we forgive someone, Jesus answers seventy times seven (Matthew 18:21-22). At the Last Supper, Jesus explains his crucifixion to his Apostles when he tells them to drink of the cup: "Drink of it, all of you; for this is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins" (Matthew 26:27-28). He forgives the paralytic at Capernaum (Mark 2:5), and the adulteress caught in the act and about to be stoned (John 8:1-11). And even following his Resurrection, his first act is to commission his disciples to forgive: "Receive the Holy Spirit. If you forgive the sins of any, they are forgiven; if you retain the sins of any, they are retained" (John 20:22-23

Friday, 7 April 2017

యౌవ్వనుడా!* *ఎంజాయ్ యువర్ లైఫ్!*

🙏🏻దయచేసి 👇🏻ఇదేంటో చదవండి.....ప్లీజ్

*యౌవ్వనుడా!*
*ఎంజాయ్ యువర్ లైఫ్!*

ఎంజాయ్ అంటే?
బీర్లతో బార్లలో గడపడం.
బాయ్ ఫ్రెండ్స్ తో , గాళ్ ఫ్రెండ్స్ తో తిరగడం. చాటింగ్, డేటింగ్,
బైక్స్ మీద చక్కర్లు కొట్టడం, సినిమాలు, షికార్లు, సిగరెట్లు, ఖైనీలు, గూట్ఖాలు.... ఇట్లా ఎన్నెన్నో.

అవును! యవ్వనం తిరిగిరాదు కదా? నీ యవ్వనంలో నీకు నచ్చినట్లుగా ఎంజాయ్ చెయ్. నీకున్న కోరికలన్నీ తీర్చుకో. ఏది కావాలంటే అదిచూడు. నీ కన్నులు నీ ఇష్టం. కన్నులు చూడడానికే కదా?

అయితే? ఒక్క విషయం మాత్రం మరచిపోవద్దు.
*నీవు ఏదయితే చేసావో? అది మంచిదైనాసరే! చెడ్డదైనా సరే! తీర్పు నుండి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ తప్పించుకోలేవు.*

*యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము;*
*ప్రసంగి 11:9*

ఇంతకీ, ఎటువైపు నీ చూపులు?
ఏంటి నీ కోరికలు?

అమ్నోను చూపులు చెల్లెలు మీదకు మళ్ళాయట. చింతాక్రాంతుడై తన కోరిక చేత చిక్కిపోతున్నాడట.
2 సమూ 13:2
చివరకి తాను కోరుకున్నట్లే చేసాడు. ఫలితం? ప్రాణం కోల్పోయాడు.

చిన్న కుమారుని చూపులు రంగుల ప్రపంచం మీదకు మళ్ళాయట.
ఏమయ్యింది?
ఫలితం? పందులపొట్టే ఆహారం.
లూకా 15:16

దేవునిచేత ఏర్పరచబడిన సంసోను చూపులు వేశ్య మీదకు మళ్ళాయట. (న్యాయాధి 16:1)
ఏమయ్యింది?
సింహాన్ని సహితం చీల్చి వేసినవాడు, పచ్చి గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపినవాడు, మూడు వందల నక్కలను పట్టుకొని శత్రువుల పొలాలను నాశనం చేసినవాడు,
ఇప్పుడు, ఏ కళ్ళు అయితే ఆ వేశ్యను చూసాయో? ఆ రెండు కళ్ళూ పెరికి వేయబడ్డాయి. దాగోను దేవతకు బలి పశువుగా నిలబడ్డాడు.

దీనా చూపులు లోకం మీదకు మళ్ళాయట. దీనా ఆదేశ కుమార్తెలను చూడాలనుకుంది.
ఆది 34:1
ఏమయ్యింది?
ఆ దేశ రాజకుమారుడు ఆమెను చూసాడు, పాడుచేసాడు. తద్వారా దీనా అన్నలు హంతకులుగా మార వలసివచ్చింది.

ఒక్కసారి ఆలోచించు!!
వీళ్ళంతా లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళే. కాని వారిఅంతం ఎట్లా వుంది? *నీ జీవితం సంతోషంగా, సాఫీగానే సాగిపోతుందిలే అనుకొంటున్నావా? కాని, దాని అంతం మాత్రం ఘోరంగా వుంటుంది. ఆ దినాన్న మాత్రం తప్పించుకోలేవు. అల్పకాల సుఖ భోగాలను చూసుకొని నిత్య రాజ్యాన్ని కాళ్ళతో తన్నేస్తావా?*

యోసేపు పవిత్రమైన జీవితాన్ని జీవించ గలిగాడు. ఇస్సాకు దేవుని కోసం అర్పణగా మారడానికి సిద్ధపడ్డాడు. యోప్తా కుమార్తె దేవునికోసం అర్పణగా మార్చబడింది.
వారి జీవితాలు ధన్యమయ్యాయి.

చివరిగా ఒక్క మాట!
*ఆనందం ఎక్కడ వుందో తెలుసా?*
*అది యేసయ్యలోనే.*
*యేసయ్యలో ఆనందం*
సమాధానకరమైనది.*
అది శాశ్వతమైనది.*

యౌవనుడా!
ఎంజాయ్ చెయ్ యేసయ్యతోనే!!

🙏🏻మీకు నచ్చితే కనీసం ఒక 10మందికి పంపి....మాతోపాటు దేవుని రాజ్యవ్యాప్తిలో భాగస్వాములు అవ్వండి.....🙌🏻నా దేవుడు నిన్ను బలపరచును గాక....ఆమేన్
***********************
✍🏻..ప్రభు సేవలో మీ సహోదరుడు.